మహిళలకు భరోసా కల్పించడమే ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్


మహిళలకు భరోసా కల్పించడమే ధ్యేయం

– ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్‌మెంట్‌ సోసైటీ సభ్యులు
– మెహెందీ డిజైన్లో మహిళలకు రెండు శిబిరాలలో శిక్షణ పూర్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించడమే ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్‌మెంట్‌ సోసైటీ  ధ్యేయమని అసోసియేషన్ సభ్యులు అన్నారు. తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంతో పాటు పట్టణంలోని ఇందిరానగర్ లో రెండు ప్రత్యేక శిబిరాల ద్వారా మహిళలకు మెహెందీ డిజైన్ లో శిక్షణ ఇస్తున్నారు.

ఆదివారం 45 రోజులతో శిక్షణ పూర్తి కావడంతో శిబిరాలను అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, సభ్యులు పరిశీలించారు. శిక్షణ పొందిన మహిళలు రికార్డులు అందించారు. అనంతరం వారికి పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి, విభిన్న రంగాల్లో నైపుణ్యతను మెరుగు పరిచేందుకు శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

వారి జీవితాలకు అర్థిక భరోసా కల్పించడమే అసోసియేషన్ ధ్యేయని అన్నారు. అదేవిధంగా రెండు శిబిరాలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి మహమ్మద్ యూనుస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖయ్యూం అతహర్, ఉపాధ్యక్షులు అబ్దుల్ సలీం, సభ్యులు లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం