అంతిమయాత్రలో ఉద్రిక్తత..!
– పటేల్ ప్రవీణ్ మృతికి న్యాయం చేయాలి
– వీరశైవ సమాజం, గ్రామస్తులు, నేతల డిమాండ్
– పట్టణ పోలీస్టేషన్ వద్ద అంబులెన్స్ నిలిపి నిరసన
– ఆందోళన కారులకు నచ్చజెప్పిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– కుటుంబానికి అండగా ఉంటానని హామి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ యువ నేత, వీరశైవ సమాజం నాయకులు పటేల్ ప్రవీణ్ కుమార్ అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఆదివారం పోస్టుమార్టం నిమిత్తం తాండూరుకు తీసుకవచ్చారు. పట్టణంలోని పోలీస్టేషన్ వద్దకు రాగానే తాండూరు వీరశైవ సమాజం సభ్యులు, పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామస్తులు, అభిమానులు ఆంబులెన్స్ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీస్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పటేల్ ప్రవీణ్ మృతికి కారకులు అయిన వారిని గుర్తించాలని, వారిని శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆందోళన కారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఆంబులెన్స్ ఆగిపోవడంతో ప్రవీణ్ కుమార్ కుమార్ సతీమణి కూడా దండం పెట్టి వేడుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. అనంతరం పటేల్ ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. పటేల్ ప్రవీణ్ మరణించడంతో భార్య, కుమారులు బోరున విలపించారు. కుటుంబ సభ్యులతో రోహిత్ రెడ్డి మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందించారు. పోస్టు మార్టం అనంతరం పటేల్ ప్రవీణ్ మృతదేహాన్ని ఇందూరు గ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇదికూడా చదవండి…

