మార్నింగ్ వాక్ లో మనోహరన్న..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్నింగ్ వాక్ లో మనోహరన్న..!
– తాండూరు పట్టణంలో విస్తృత పర్యటన
– ప్రజలతో మాట్లాడి సమస్యలు, ఇబ్బందులపై ఆరా
– చెత్త సేకరణ, డ్రైనేజీల నిర్వహణపై పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. బుధవారం తాండూరు పట్టణంలో మార్నింగ్ వాక్ చేశారు. సూర్యోదయానికి ముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్ లో వాకర్స్ తో మిలాఖత్ అయ్యారు.

నడక చేస్తున్న వారితో ముచ్చటించారు. సరదాగా బ్యాట్ పట్టుకుని బాల్ ను బాదేసి.. అక్కడి వారిని ఉత్సహా పరిచారు. అనంతరం పట్టణంలోని నడి వీధుల్లోకి కదిలారు. మున్సిపల్ నుంచి చెత్త సేకరిస్తున్న ట్రాక్టర్లను నిలిపి మాట్లాడారు. పట్టణంలో చెత్త సేకరణ ఎలా జరుగుతుందని ఆరా తీశారు. డ్రైనేజీల నిర్వహణ సక్రమంగా జరుగుతుంతా లేదా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తరువాత తాండూరు పట్టణంలోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు దృష్టిసారిస్తామని అన్నారు. ఖచ్చితంగా తాండూరును సమస్యలు లేని పట్టణంగా మారుస్తామని భరోసా అందించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, టీజేఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ సోమ శేఖర్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ పార్టీకి షాక్..!