రామన్న రాకకు పక్కా ఏర్పాట్లు..!
– స్వయంగా పరిశీలిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరుకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు(రామన్న) రాక కోసం పార్టీ తరుపున పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు పైలెట్ రోహిత్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పార్టీ నేతలు పంజుగుల విఠల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, డా.సంపత్ కుమార్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో కేటీఆర్ తాండూరుకు వస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తాండూరులో హెలీప్యాడ్ స్థలాన్ని రోహిత్ రెడ్డి పరిశీలించారు.

పైలెట్ రోహిత్ రెడ్డి నివాస సమీపంలోనే హెలిక్యాప్టర్ లాండింగ్ జరుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షో జరిగే స్థలాన్ని రోహిత్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి సమీక్షించారు. రోడ్ షోకు జనాలు ఎంతమంది రావచ్చు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంచనా వేశారు. కేటీఆర్ రోడ్ షో సక్సెస్ అయ్యేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపడుతున్నారు. కేటీఆర్ రోడ్ షోను సూపర్ సక్సెస్ చేస్తామని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

