సంక్షేమ సారథి కేసీఆర్..!
– బీఆర్ఎస్ హాయం పథకాలతోనే పేదలకు లబ్ది
– 20వ వార్డు కౌన్సిలర్ నవీనా సంతోష్ గౌడ్
– గాంధీనగర్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన సంక్షేమ సారథి మాజీ సీఎం కేసీఆర్ అని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ నవీనా సంతోష్ గౌడ్ అన్నారు.

మంగళవారం వార్డులోని గాంధీనగర్ చాపల బస్తిలో కౌన్సిలర్ నవీన, బీఆర్ఎస్ యువనాయకులు సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకుని కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో పథకాలు ఇచ్చిన హామీ అన్ని మళ్ళీ అవే కొనసాగుతున్నాయని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటి కూడా అమలు చేయలేదని అన్నారు. ఆరు గ్యారంటీలులలో ఒకటి మాత్రమే అమలు అయిందని.. మిగతా 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జీ, బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, సీనియర్ నాయకులు రమేష్ షింధే, అక్షయ్, నగేష్, గణేష్, కరణ్, రవి, మహిళలు రేఖ షిందే, సురేఖ రెడ్డి, పద్మ, స్నేహ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


