మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌కు సన్మానం
– శుభాకాంక్షలు తెలిపిన పీఆర్టీయూ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లకు పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి మున్సిపల్ నూతన చైర్ పర్సన్‌గా, అబ్దుల్ రజాక్ వైస్ చైర్మన్‌లుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం యాలాల మండల పీఆర్టీయూ శాఖ నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి దంపతులతో పాటు, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లను సన్మానించారు.

ఈ సందర్భంగా వారిని అభినందనలు తెలుపుతూ తాండూరు పట్టణ అభివృద్ధికి వారి నాయకత్వం దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ యాలాల మండల అధ్యక్షులు సి. కృష్ణ రెడ్డి, కార్యదర్శి రాములు, జిల్లా గౌరవ అధ్యక్షులు డి. వెంకట్ రామ్ రెడ్డి, నాయకులు మహేష్ కుమార్, యు. వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జీహెచ్‌ఎం కృష్ణయ్య, పరమేష్, వెంకటేష్ ఎల్లయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


