‘తాటికొండ’కు శ్రద్ధాంజలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘తాటికొండ’కు శ్రద్ధాంజలి..!
– ప్రభాకర్ గుప్తకు నివాళులు అర్పించిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– అంజలి ఘటించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– కుటుంబాన్ని పరామర్శించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన సామాజిక సేవకులు, విశ్రాంత ఉద్యోగి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ మామ తాటికొండ ప్రభాకర్ గుప్తకు శ్రద్ధాంజలి తెలిపారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రభాకర్ గుప్తా ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి సోమవారం పరిమల్ గుప్త నివాసానికి చేరుకొని ప్రభాకర్ గుప్తా భౌతిక ఖాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా నివాసానికి చేరుకుని ప్రభాకర్ గుప్తకు అంజలి ఘటించారు.

అంతకుముందు తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, నాయకులు పరిమల్ గుప్తలను పలకరించి సానుభూతిని తెలిపారు. వారితోపాటు తాండూరుకు చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు వచ్చి తాటికొండ ప్రభాకర్ గుప్తకు నివాళులర్పించారు. సోమవారం తాండూరులో ప్రభాకర్ గుప్త అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

 

అర చేతిలోనే ‘మీసేవ’లు..!