పైలెట్ బేయిల్‌లో షరతులపై చర్చ..!
– తాండూరు పీఎస్‌కు నిర్ణీత వారం గడువులు
– జరిమానాతో కూడా నిబంధనలు..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టు నుంచి మంజూరు అయిన బేయిల్ కండిషన్లపై సర్వత్రా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈనెల 13న కౌంటింగ్ కేంద్రంలో జరిగిన తోపులాటపై మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మరో 8 మందిపై నాన్ బెయిలేబుల్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.

రెండు రోజుల క్రితం పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బేయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో పైలెట్ రోహిత్ రెడ్డి, నేతలు బేయిల్ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు పైలెట్ రోహిత్ రెడ్డి తన నివాసం నుంచి కేసులో ఉన్న నాయకులు , పార్టీ నేతలతో కలిసి పాదయాత్రగా వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి, రోహిత్ రెడ్డికి అనుకూలంగా నేతలు నినాదాలు చేసుకుంటూ పోలీస్టేషన్ వద్దకు చేరుకున్నారు.

నేతలు పెద్ద ఎత్తున రావడం పట్ల పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు. పోలీస్టేషన్‌లోకి రోహిత్ రెడ్డి, కేసుకు సంబంధం ఉన్న నేతలను మాత్రమే లోపలికి అనుమతించారు. విచారణ పూర్తి అయ్యేంత వరకు పోలీస్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్టేషన్ వద్దకు రావడంతో రాజకీయ చర్చనీయాంశంగా మారింది. రోహిత్ రెడ్డికి నేతలకు కండిషన్ బేయిల్ మంజూరు అయినట్లు తెలిసింది. రూ. 25వేల జరిమానతో పాటు 8వారాల పాటు ప్రతి సోమవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటలలోపు పోలీస్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉంటుందని సమాచారం.


