మార్కెట్ యార్డులో రికార్డుల కొనుగోళ్లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్కెట్ యార్డులో రికార్డుల కొనుగోళ్లు..!
– ఒకే రోజూ రూ. 2కోట్ల ఉత్పత్తుల విక్రయాలు
– తాండూరులో పంటల ధరలు ఎంతంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో రికార్డుల కొనుగోళ్లు జరిగాయి. ఒకే రోజూ రూ. 2కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి.

దీనికి అసలు కారణం ఏంటంటే..? తాండూరు మార్కెట్ కమిటిలో ఈ నామ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా వ్యాపారులు రెండు రోజులు కొనుగోళ్లు జరపలేదు. ఆడ్తిదారులు రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు, రైతుల సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వాలని అధికారులు సూచించడంతో ఇందుకు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగా మార్కెట్ కార్డులో బుధ, గురువారాలు కొనుగోళ్లు జరగలేదు.

శుక్రవారం ఈ-నామ్ పాత సాఫ్ట్వేర్ ద్వారానే పంటల కొనుగోలుకు వ్యాపారులకు అధికారులు అనుమతి చ్చారు. దీంతో రెండు రోజులుగా పేరుకుపోయిన ఉత్పత్తులకు ఒకేరోజూ విక్రయాలు చేపట్టారు. వాటిలో 2,254 క్వింటాళ్ల కందులు(రూ.1.73 కోట్లు), 243 క్వింటాళ్ల వేరు సెనక్కాయలు(రూ.20.53 లక్షలు), 110 కింటాళ్ల పప్పు సెనగలు(రూ.5.69 లక్షలు), జొన్నలు 128 క్వింటాళ్ల(రూ.5.19 లక్షలు)ఉన్నాయి. క్వింటా కందులకు గరిష్టం 5.8,415, 6,975, సగటు ధర రూ. 7,895. పప్పు సెనగకు గరిష్టం రూ.5,301.. కనిష్టం రూ.4,959, సగటు ధర 5.175 వేరు సెనగ కాయ్ లకు గరిష్టం రూ.9,207, కనిష్టం రూ.7,500, సగటు ధర రూ.8,451 జొన్నలకు రూ. 4.225 లభించింది. మొత్తం రూ.2,04 2,730 క్వింటాళ్ల పంటలు కొన్నారు. ఇంకా వారం రోజుల వరకు పాత పద్దతిలోనే కొనుగోళ్లు జరుగుతాయని మార్కెట్ కమిటి కార్యదర్శి తెలిపారు.

నన్ను చంపాలని చూస్తున్నారు..!