రంజాన్ తోఫా పంపిణీలో చిన్నచూపా..?
– బీఆర్ఎస్ కౌన్సిలర్లను విస్మరించడం తగదు
– ఎమ్మెల్యే హామిలో ప్రాధాన్యం ఇదేనా
– బీఆర్ఎస్ యువనాయకులు ఎజాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాస తోఫా పంపిణీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను చిన్నచూపు చూడడం తగదని ఆ పార్టీ 25వ వార్డు యువనాయకులు ఎజాజ్ మండిపడ్డారు.

రంజాన్ పండగను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంకు తోఫాలను మంజూరు చేసింది. తాండూరు పట్టణంలో తోఫాల పంపిణీ బాధ్యతను ముస్లిం వెల్పేర్ అసోసియేషన్‌కు అప్పగించింది. అయితే రంజాన్ తోఫా పంపిణీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఇచ్చిన ప్రాధాన్యతను బీఆర్ఎస్ పార్టీకి కౌన్సిలర్లకు ఇవ్వకపోవడంపై ఎజాజ్ ఓ ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

పట్టణంలోని కాంగ్రెస్ కౌన్సిలర్లు వారి వార్డులలో తోఫాలు అందిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ వార్డులలో ఆ పార్టీ కౌన్సిలర్లకు అవకాశం ఇవ్వకపోవడం మండిపడ్డారు. బీఆర్ఎస్ వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటి చేసి ఓడిపోయిన వారి చేతుల మీదుగా రంజాన్ తోఫాలు అందించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీలకతీతంగా వార్డులకు, కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతుంటే.. ఇందుకు భిన్నంగా పరిణాలు జరగడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే హామిలకు ప్రాధాన్యం ఇదేనా అని నిలదీస్తున్నారు. రంజాన్ తోఫా పంపిణీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లకు విస్మరించడం తగదని, కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సైతం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని వార్డు కౌన్సిలర్ నసీరా భాను(ఎజాజ్ )కూడా డిమాండ్ చేస్తున్నారు.


