తాండూరు ప్రజలకు శుభవార్త..!
– ఈనెల 29న ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం
– 10మంది వైద్యుల సమక్షంలో రూ. 20వేల టెస్టులు ఫ్రీ
– కిమ్స్, తాండూరు ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
– ప్రజలు సద్వినియోగం చేసుకోవాలిన విజ్ఞఫ్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త. ఈనెల 29న తాండూరులో ఉచిత క్యాన్స్రర్ శిబిరం నిర్వహిస్తున్నారు.

తాండూరు ఐఎంఏ, కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని సాయితరుణ్ ఆసుపత్రిలో ఐఏఎం అధ్యక్షులు డా.జయప్రసాద్, కిమ్స్ ఆసుపత్రి ప్రతినిధులు ధీరజ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈనెల 29న సాయితరుణ్ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ అంకాలజీస్ట్ డా. మధుదేవర శెట్టి, డా. తోట నరేందర్ కుమార్, 10 మంది వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో రూ. 20వేల విలువైన పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు.

ఇందులో మాబోగ్రఫీ, పాప్ స్మీయర్, బోత్ బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, ఎక్స్ రే, ఎండోస్కోప్, అల్ట్రాసౌండ్ అబ్డామిస్ అండ్ పెల్పస్‌తో పాటు వైద్యుల సూచన మేరకు సీబీపీ, సీఏ-125, సీఏ-19.9, పీఎస్‌ఏ పరీక్షలు చేస్తారని చెప్పారు. దీంతోపాటు ముందస్తుగా క్యాన్సర్‌ను గుర్తించే క్యాన్సర్ స్క్రీనింగ్ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. క్యాన్సర్‌పై అనుమానం ఉన్న వారు వారి పాత రిపోర్టులు తీసుకుని పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఎండోస్కోపింగ్ చేసుకునే వారు ఎలాంటి ఆహారం తినకుండా రావాలని సూచించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎం సభ్యులు డా.సంతోష్ కుమార్, కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


