ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
– స్కూల్‌ ఎడ్యూకేషన్ డైరెక్టర్‌ను కలిసిన పీఆర్డీయూ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎడ్యూకేషన్(టీఎస్​పీఎస్సీ) డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్‌ నికోలస్‌ను తాండూరు పీఆర్టీయూ నేతలు కోరారు.

గురువారం హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో డైరెక్టర్ డా. ఈ. నవీన్ నికోలస్‌ను పీఆర్టీయూ సంఘ నాయకులు గర్గుపల్లి నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి యాలాల పీఆర్టీయూ మండల అధ్యక్షులు క్రిష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి.. పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పలు ఉపాధ్యాయ సమస్యలను ఆయన దృష్టికి తీసుకవెళ్లారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలని కోరారు. ఇందుకు టీఎస్​పీఎస్సీ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ సానుకూలంగా స్పందించినట్లు క్రిష్ణారెడ్డి తెలిపారు.

తాండూరు స్టోన్‌ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలి