కాంగ్రెస్ పథకాల అమలుకు కృషి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ పథకాల అమలుకు కృషి..!
– ఎమ్మెల్యే సహాకారంతో పార్టి అభివృద్ధికి తోడ్పాటు
– పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా న్యాయవాది గోపాల్
– ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులను కలిసి ధన్యవాదాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పేదలకు అందించడంతో పాటు పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పార్టీ వికారాబాద్‌ జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్ అన్నారు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటిలో జిల్లా అధికార ప్రతినిధిగా ఆయన నియామకం అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌ నాయక్‌లను కలిసి న్యాయవాది గోపాల్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడం పట్ల మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సామాన్యునికి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధాంతాలు చేరే విధంగా కృషి చేస్తానని అన్నారు.

గత ఐదు సంవత్సరాలుగా కుంటుబడిన తాండూరును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. తాండూరు అభివృద్ధి కోసం సుమారుగా రూ. 1000 కోట్ల సాధించి తీసుకువచ్చిన ఘనత మనోహర్ రెడ్డి గారికి దక్కుతుంది అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రోడ్లు మరియు మున్సిపల్ రోడ్లు తాండూరు నుంచి వికారాబాద్ రోడ్డు గత పాలకులు విస్మరించినప్పటికీ గెలిచిన రెండేళ్లలోనే అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ పటిష్టతకు పాటుపడతానని అన్నారు.

చెవుడు, మూగ సమస్యలకు చెక్..!