కార్డు లేకున్నా క్యాష్‌ విత్ డ్రా..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం హైదరాబాద్

కార్డు లేకున్నా క్యాష్‌ విత్ డ్రా..!
– ఆర్బీఐ తీసుకవచ్చిన సదుపాయం
– కార్డ్‌లెస్ విత్‌డ్రా ఏటీఎంల ఏర్పాటు
– ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి
దర్శిని డెస్క్ : పదేళ్ల క్రితం వరకు నగదు విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో ఏటీఎం దగ్గరి వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల మొబైల్ యాప్ ఆధారిత పేమెంట్స్ (యూపీఐ) డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలామంది లావాదేవీలను ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. అయినా.. ఒక్కోసారి నగదు అవసరం రావచ్చు. ఆ సమయంలో ఏటీఎంకు వెళ్లి డెబిట్ క్యాష్ విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. అయితే డెబిట్ కార్డు అందుబాటులో లేకపోతే మాత్రం క్యాష్ విత్ డ్రా చేసుకోవడం కష్టంగా ఉండేది.

కానీ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. అందుబాటులో డెబిట్ కార్డు లేకపోయినా నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది. ఆధునిక టెక్నాలజీ సహాయంతో నగదు విత్ డ్రా కోసం బ్యాంకర్లు ఏటీఎంలను ఏర్పాటు చేశాయి. దీంతో కార్డులేకుండా నగదును డ్రా చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ వినియోగదారులకు కొత్త అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ఆర్బీఐ కార్డ్‌లెస్‌ విత్ డ్రా ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది.

ఎలా పనిచేస్తుందంటే..
ఏటీఎం నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసేందుకు యూపీఐ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు రహిత లావాదేవీలు పూర్తి చేయొచ్చు. మొబైల్ యాప్స్.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల సాయంతో డెబిట్ కార్డు లేకున్నా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారంగా డెబిట్ కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

తొలుత ఏటీఎం స్క్రీన్‌పై యూపీఐ కార్డ్‌లెస్‌ క్యాష్‌ ఆప్షన్‌న్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత విత్‌డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్ డ్రా సెక్షన్‌లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే తాత్కాలిక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఫోన్‌లోని బ్యాంకు యూపీఐ ఆధారిత యాప్‌తో దాన్ని స్కాన్‌ చేయాలి. యూపీఐ పిన్‌ను యాప్‌లో ఎంటర్‌ చేయాలి. ఆతరువాత ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వస్తాయి. నగదు విత్‌డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ కూడా వస్తుంది. యూపీఐ కార్డ్‌లెస్ విత్‌డ్రా లావాదేవీలపై రోజుకు కొన్నింటిపై కొన్ని బ్యాంకులు పరిమితులు విధించాయి. త్వరలోనే ఈ సేవలను అంతటా విస్తరించేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. వినియోగదారులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.

ఇదికూడా చదవండి…

‘ఫ్రెష్‌’గా కల్తీ..!