ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థి
– పరీక్షల్లో పేయిల్ అయ్యాడని నిర్ణయం
– తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్ పరీక్షల్లో ఫేయిల్ అయ్యాడని ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన తాండూరు మండలం అంతారం గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన నక్కల పుల్లప్ప కుమారుడు నక్కల సైమన్ పట్టణంలో ఓ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీఈసీ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో సైమన్ కేవలం ఇంగ్లీష్ సబ్జెక్టులో మాత్రమే పాస్ అయి మిగతా సబ్జెక్టుల్లో ఫేయిల్ అయ్యాడు. దీంతో ఇంట్లో వాళ్లు ఏమంటారో అని భయపడి ఆదివారం మధ్యాహ్నం తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

కుటుంబీకులు పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సైమన్ ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంభీకులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థి ఆచూకీ తెలిస్తే సెల్ : 9014642509, 9014001720లకు సంప్రదించాలని కోరారు.


