డ్రైనేజీ అక్రమణలపై కొరడా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

డ్రైనేజీ అక్రమణలపై కొరడా..!
– బస్టాండ్‌ వద్ద అక్రమణల తొలగింపు
– అధికారులతో చిరు వ్యాపారుల వాగ్వివాదం
– లెక్కచేయకుండా కూల్చివేతల కొనసాగింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : డ్రైనేజీపై అక్రమంగా ఏర్పాటు చేసుకున్న డబ్బాలపై తాండూరు మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు.

శుక్రవారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూల్చివేతలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ కంపౌండ్ వాల్‌కు ఆనుకుని ఉన్న డ్రైనేజీపై చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను తొలగించారు. జేసీబీ యంత్రంలో నిర్మాణాలను కూల్చివేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గరుండి పోలీసుల సమక్షంలో కూల్చివేతలు చేశారు. అకస్మాత్తుగా అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని చిరు వ్యాపారులు వ్యతిరేకించారు. కూల్చివేతలకు వచ్చిన టీపీఓ మమత, అధికారులతో వాగ్వివాదానికి దిగారు.

తాండూరు ఎమ్మెల్యే అనుమతితో నే నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నామని అధికారులకు చెప్పారు. ఇందుకు అధికారులు ఏం చెప్పినా వినేది లేదని తేల్చి చెప్పారు. రోడ్డుపై ఉన్న ఆక్రమణలు తొలగించుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. ఈక్రమంలో నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారో చూద్దాం అంటూ ఆందోళనకు దిగారు. అయినా కూడా అధికారులు జేసీబీతో డబ్బాలను నేలమట్టం చేశారు. స్థానిక నాయకులు, వ్యాపారుల విజ్ఞప్తితో డబ్బాల తొలగింపుకు సమయం ఇవ్వాలని వేడుకున్నారు.

చివరకు రెండు, మూడు గంటల్లో డబ్బాల తొలగింపుకు అధికారులు సమయం ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అధికారుల కూల్చివేతలపై పలువురు విమర్శలు చేశారు. సామాన్యులపై కొరడ జులిపించడం సరికాదని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మా సొంత భూమిపై తప్పుడు ప్రచారం