తప్పుల్లేకుండా జన గణన చేపట్టాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

తప్పుల్లేకుండా జన గణన చేపట్టాలి
– మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి
– ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : జన గణనను తప్పుల్లేకుండా చేపట్టాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు.

వచ్చేనెల మే 11 నుండి జరిగే జనగణనను దృష్టిలో ఉంచుకుని సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో జనాభా గణన ఎన్యూ మారేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ సూపర్వైజర్లు తమ తమ పరిధిలో ఎప్పటికప్పుడు పరిశీలించి తప్పులు జరగకుండా చూడాలని కోరారు.

జనాభా గణాలకు సంబంధించిన మార్గదర్శకాలను అందరూ తప్పక చదివి మార్గదర్శకాలు అనుగుణంగా ఇండ్ల చేపట్టాలని ఆయన కోరారు. జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమిలో అక్రమాలు బయటపెడతాం