కష్టాలను అధిగమిస్తేనే విజయానందం
– యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి
– హిందూ ధార్మిక పరిషత్ ప్రతిభా పురస్కారాలు
– ఘనంగా పదో తరగతి విద్యార్థులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి మనిషి కష్టాలను అధిగమిస్తేనే విజయానందాలను పొందుతారని యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు.

మంగళవారం రాత్రి తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హింధూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం-2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ముఖ్య అతిథి, ప్రధాన వక్త యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు సహజం అని, వాటిని అధిగమిస్తే విజయానందం ఉంటుందని అన్నారు. ప్రతి వ్యక్తి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు.

వాటిని సాధించేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. అప్పుడే మనకు గుర్తింపు రావడంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చని అన్నారు. అందుకు ఎలాంటి కష్టాలను అయినా ధైర్యంగా ఎదుర్కోవాలని, పట్టుదలతో సాగాలని అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు సాధారణమని అన్నారు. వాటిని అధిగమిస్తే విజయానందాలను అందుకోవచ్చని అన్నారు.

ఏ రంగంలో ఉన్న కూడా పట్టుదలతో రాణించాలని అన్నారు. అనంతరం హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ ఆధ్వర్యంలో ఇటీవల పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ప్రతిభా పురస్కారాలను ప్రధానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ వెంకటయ్య, సీనీయర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జుంటుపల్లి అరవింద్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కోట్రిక కిరణ్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా సంస్థల ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


