పంచాయతీ ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు
– యాలాల మండల బషీర్‌మీయా తాండాలో ఘటన
– కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామంలో అవసరాల కోసం వినియోగించే పంచాయతీ ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు.

ఈ సంఘటన యాలాల మండలం బషీర్‌మీయా తాండాలో చోటు చేసుకుంది. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండాకు చెందిన ట్రాక్టర్(చాసీ నెంబర్ 006511260B1) ట్రాలీతో పాటు డ్రైవర్ వర్త్యా సుభాష్ ఈనెల 3న సాయంత్రం తాండాలోని వాటర్ ట్యాంకు దగ్గర నిలిపి ఉంచాడు.

మరుసటి రోజు వెళ్లి చూడగా ట్రాక్టర్ ట్రాలీ కనిపించ లేదు. దీంతో వెంటనే పంచాయతీ సెక్రెటరీ వెంకట్ రెడ్డికి సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.


