గిన్నిస్ రికార్డ్స్‌లో తాండూరు అమ్మాయికి చోటు
– కీబోర్డు వాయిద్యంలో ఘనత
– ప్రశస్థకు వెలువెత్తిన ప్రశంసలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అమ్మాయికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది.

ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల పర్యవేక్షణలో నిర్వహించిన బృహత్తర సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన రెండు వేల మంది కీబోర్డు వాయిద్యకారులు గంట పాటు నిరంతరాయంగా ఎలక్ట్రానిక్ కీబోర్డు వాయించి రికార్డు సృష్టించారు.

ఇందులో విశేష ప్రతిభ కనబరిచిన 777 మంది చిన్నారులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. వీరిలో తాండూరుకు చెందిన బీఎస్ఎన్లో ఎస్డీఈ పి. ప్రమోద్ కుమార్ కుమార్తే ప్రశస్థ కూడా ఉంది. హల్లెల్ సంగీత పాఠశాలలో నిహిత్ కీబోర్డు వాయిద్యం నేరుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియం లో హల్లెల్ సం గీత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్లో విద్యార్థి ప్రశస్థ కూడా ప్రతిభను కనబరించింది.

ఈ సందర్భంగా సంగీత పాఠశాల వ్యవస్థాపకులు అగస్టీన్ దండిగి ప్రశస్థను అభినందించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మెమోంటో పత్రాన్ని అందజేశారు. సంగీతంపై అభిరుచితో నిరంతరం సాధన చేయడం పట్ల ఈ ఘనత సాధ్యమయ్యిందని ప్రశస్థ తెలిపింది. ప్రపంచ స్థాయి వేదికపై తన ప్రతిభను ప్రదర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ప్రశస్థతో పాటు ఆమె తల్లిదండ్రులను పలువరు అభినందించారు.


