ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
– మున్సిపల్‌ వార్డు సభలలో అధికారులు
– పోలీసు రక్షణ చర్యలపై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సంక్షేమం, అభివద్ధి, రక్షణే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయని పలువురు అధికారులు అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డ్ సభలు నిర్వహించారు.

ఇందిరానగర్‌ 6వ వార్డులో నిర్వహించిన సభలో తాండూరు ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్ పి.రాకేష్‌ రెడ్డి, పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళిక పై చర్చించారు.

వర్షపు నీరు మురుగు కాలువల పూడికతీత, మీరు నిలవకుండా నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, జల్ సంచాయి – జల్ భగీరథి, ఘన వ్యర్ధాల నిర్వహణ, ఓటర్ జాబితాలో ప్రత్యేక సవరణ, వర్షాకాలంలో మొక్కల పెంపకం, వంటి ఒకల అంశాలపై చర్చించారు. అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్షణ నేత్రం పోస్టర్లను విడుదల చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ సీసీటీవీ ప్రాముఖ్యతను వివరించారు.

మహిళా రక్షణ, మాదక ద్రవ్యాల నివారణ మరియు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. మరోవైపు పట్టణంలోని పలు వార్డుల్లో కూడా వార్డు సభలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బి. అనిల్ కుమార్, ఎం. ప్రత్యూష, నాగమణి, తాయాబ్ సుల్తానా, వార్డ్ ఆఫీసర్లు అనిల్ కుమార్, చంద్రశేఖర్, సాయి కృష్ణ, షఫీవుల్లా, పోలీస్ శాఖ అధికారులు, అంగన్వాడి టీచర్లు, ఆర్పీలు, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సర్‌ విజయవంతానికి కృషి