పోలీసు కానిస్టేబుళ్లపై వేటు..!
– జంట హత్య కేసుల నిందితురాలి పట్ల నిర్లక్ష్యం
– ఠాణాలో ఆత్మహత్యాయత్నఘటనపై చర్యలు
– సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లపై శాఖ పరమైన వేటు పడింది.

వారిని సస్పెండ్ చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందో వివరాళ్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన తాండూరు జంట మహిళల దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమా బేగం విచారణలో భాగంగా కరణ్ కోట్ పోలీస్టేషన్‌కు తరలించారు.

విచారణలో ఉండగా కరీమాభేగం బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సమయంలో విధుల్లో ఉన్న బషీరాబాద్‌కు చెందిన మహిళ కానిస్టేబుల్ సునీత, యాలాల పోలీస్టేషన్‌కు చెందిన బసవరాజులు నిర్లక్ష్యం వహించినట్లు ఉన్నతాధికారులు నిర్దారించారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా సీరీయస్ అయ్యారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.

సోమవారం జిల్లా ఎస్పీ సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిందితురాలును అదేరోజు ఆమెను చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది.



