మృత్యు ట్రాక్టర్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మృత్యు ట్రాక్టర్..!
– వేగంగా వస్తూ బైకుకు ఢీ
– ఒకరి మృతి, మరోకరికి గాయాలు
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అతివేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ వ్యక్తి పాలిట మృత్యు వాహనంగా మారింది. బైకుపై వెళుతున్న వారిని ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరు గాయాలపాలయ్యారు.

ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సీసీఐ కాలనీకి చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి వికాట్ సాగర్ సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో తన బైకుపై ధారూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన బాబుతో కలిసి బైకుపై కాలనీ నుంచి బయల్దేరాడు.

సీసీఐ కాలనీ వద్ద మలుపు తిరిగే క్రమంలో గౌతాపూర్‌ వైపు నుంచి వస్తున్న నాపరాతి లోడ్ ట్రాక్టర్ వేగంగా వస్తూ బైకును ఢీ కొట్టింది. దీంతో బైకు పైనుంచి ఇద్దరు కిండపడిపోయారు. వెనుకాల కూర్చున్న రాధాకృష్ణ కాలుపై నుంచి ట్రాక్టర్ వెనుక టైరు దూసుకెళ్లింది. ఈక్రమంలో కాలు విరిగిపోగా తలకు తీవ్రగాయాలయ్యాయి.

ముందు ఉన్న బాబుకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాధాకృష్ణ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మార్గమద్యలో రాధాకృష్ణ మృతి చెందాడు. ఈ సంఘటన కుటుంబంలో తీవ్ర విషాధాన్ని నింపింది. మృతుని భార్య మనోజ్ఞ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.

నేడు, రేపు వర్షాలు