విద్యార్థుల‌ను కాటేసిన‌ ఎలుక‌లు

ఆరోగ్యం క్రైం రంగారెడ్డి వికారాబాద్

విద్యార్థుల‌ను కాటేసిన‌ ఎలుక‌లు
– షాద్‌న‌గ‌ర్ గురుకుల పాఠ‌శాల‌లో క‌ల‌క‌లం
– ఆసుత్రిలో చికిత్స చేసుకున్న విద్యార్థులు
రంగారెడ్డి జిల్లా, ద‌ర్శిని ప్ర‌తినిధి : గురుకుల పాఠ‌శాల‌లో చదువుకుంటున్న విద్యార్థుల‌ను ఎలుక‌లు కాటేశాయి. ఎలుక‌ల దాడిలో ఓ తొమ్మిది మంది విద్యార్థులు ఆసుప‌త్రి పాల‌య్యారు. ఈ సంఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లి గురుకుల పాఠశాలలో గ‌త కొన్ని రోజులుగా ఎలుక‌ల బెడ‌ద నెల‌కొంది. అయితే ఆదివారం రాత్రి ఎలుకలు నిద్రిస్తున్న విద్యార్థుల‌ను కాటేశాయి. ఈ ప్ర‌మాదంలో పాఠ‌శాల‌కు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఎలుక‌ల వ‌ల్ల గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా కలకలం సృష్టించింది. ఎలుక‌ల దాడిలో గాయ‌ప‌డిన విద్యార్థులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఎలుక‌ల దాడిలో గాయ‌ప‌డిన విద్యార్థులు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. విష‌యం తెలిసిన విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.