ఎస్‌ఐఆర్ గడువు పెంపు..!

జాతీయం తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఎస్‌ఐఆర్ గడువు పెంపు..!
– ముసాయిదా ప్రకటనలో మార్పులు
– తుది జాబితా విడుదలపై స్పష్టత
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడగించింది.

ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24 వరకు ఉన్న ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ గడువును ఆగస్టు 3వ తేదీవరకు పొడిగించినట్లు స్పష్టం చేసింది.

అనేక జిల్లాలో సర్‌పై అవగాహన లేక మందకోడిగా కొనసాగుతుండగా గడువు సమీపిస్తుండడంతో అనేక రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణను పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు అందించాయి.

దీంతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ గడువు పొడిగింపును ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణలో ఆగస్ట్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్‌ 12న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని ప్రకటించింది.

ఎస్‌ఐఆర్‌తో అప్రమత్తంగా ఉండాలి