శాకాంబరీ మాత నమోస్తుతే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శాకాంబరీ మాత నమోస్తుతే..!
– వాసవీ మాతకు ప్రత్యేక అలంకరణ
– నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ శోభ
– దర్శించుకున్న చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : శాకాంబరీ వాసవీ మాత నమోస్తుతే.. అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థించారు.

ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా తాండూరు పట్టణంలోని నాగేశ్వర దేవాలయంలో వాసవి మాత అమ్మవారిని శాకంబరీ దేవిగా అలకంరించారు. వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో శాకాంబరీ ఉత్సవాలను జరుపుకున్నారు. ఇందులో భాగంగా వాసవీ మాతను వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు.

వేదపండితుల మంత్రోచ్చరణల మద్య అమ్మవారికి పూజలు నిర్వహించారు. వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో మహిళలు భక్తిశ్రద్దలతో కుంకుమార్చన కార్యక్రమం జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలిరావడంతో దేవాలయంలో ఆషాఢ శోభ సంతరించుకుంది.

శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ దాదాపురం సతీష్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట మురళి కృష్ణ కార్యదర్శి కొట్రిక కిరణ్ కుమార్, వాసవి మహిళా సంఘం అధ్యక్షులు గుబ్బ ప్రగతి, కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి వేముల పల్లవి, ఆర్యవైశ్య సంఘ, మహిళా సంఘం, యువజన సంఘం కార్యవర్గ సభ్యులు, వాసవి భక్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
———————————————————————————————————————–

ఘనంగా రామన్న బర్త్‌ డే..!