శభాష్.. శ్రీలక్ష్మీ..!
– రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
– తాండూరు అక్షర స్కూల్ విద్యార్థిని ప్రతిభ
తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్.. శ్రీలక్ష్మీ అని తాండూరు అక్షర స్కూల్ విద్యార్థినిని స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం అభినందించింది.

జిల్లా స్థాయిలో నిర్వహించిన ఖోఖో పోటీలలో ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అక్షర స్కూల్లో 9వ తరగతి చదువుతున్న శ్రీలక్ష్మీ మంగళవారం వికారాబాద్ లో జరిగిన జిల్లా స్థాయి పోటీలో పాల్గొని ప్రతిభను కనబరించింది.

దీంతో శ్రీలక్ష్మీని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇందుకు స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్, యజమాన్యం, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికకావడం పట్ల శ్రీలక్ష్మీని శభాష్ అంటూ అభినందించారు. అదేవిధంగా పీఈటీలు రవీందర్ రెడ్డి, గోపాల్ లను కూడా అభినందించారు.

ఇదికూడా చదవండి…

