
తాండూరు ఎక్సైజ్ పోలీసుల ఆఫర్
– రేపు రెండు బైకులకు బహిరంగ వేలం
– పాల్గొని వాహనాలను సొంతం చేసుకునే అవకాశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎక్సైజ్ శాఖ పోలీసులు ప్రజలకు ఆఫర్‌ను ప్రకటించారు. రేపు సోమవారం తాండూరు పట్టణంలోని కార్యాలయంలో రెండు బైకుల బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ సీఐ రాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

వివిధ తనిఖీలలో పట్టుబడిన ఈ వాహనాలను ఉన్నతాధికారుల ఆదేశాలతో వేలం వేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తాండూరు ఎక్సైజ్ వాఖ పరిధిలో పట్టుబడిన వాహనాలకు వేలం వేస్తున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేయడం జరుగుతుందని చెప్పారు.

ఒక టీవీఎస్ స్టార్ సిటీతో పాటు ఫ్యాషన్ ప్లస్ బైకు ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల వారు వేలంలో పాల్గొని వాహనాలను దక్కించుకోవచ్చని సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


