కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి
– భక్తులకు అన్నదానం అభినందనీయం
– మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్లో వెలసిన కట్ట మైసమ్మ తల్లి కృప అందరిపై మెండుగా ఉండాలని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ప్రార్థించారు.

బుధవారం అమావాస్య సందర్భంగా దేవాలయంలో అల్లంపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విఠల్ నాయక్ హాజరై దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కట్ట మైసమ్మ తల్లి కృపతో అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. దేవాలయంలో ప్రతి అమావాస్యకు భక్తులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.

అన్నిదానాల కన్న అన్నదానం ఎంతో గొప్పదని, ఈ కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు కలగకుండా కొనసాగించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


