సాయం మాట మరువని సర్పంచ్ అరుణ..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

సాయం మాట మరువని సర్పంచ్ అరుణ..!
– టెన్త్ విద్యార్థులకు ఆర్థిక చేయూతలో ఆదర్శం
– జనగామ సర్పంచ్‌ను అభినందించిన గ్రామస్తులు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. పెద్దేముల్ మండలం జనగామ గ్రామ సర్పంచ్ సంజమొల్ల అరుణ మాత్రం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచారు.

మండలంలోని మంబాపూర్ హైస్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థులు పరీక్షల్లో 500 మార్కులు సాధిస్తే ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తానని గతంలో అరుణ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముగ్గురు విద్యార్థులు ఎం.రాధిక, పి. శ్రీవాణి, శ్రీవైష్ణవిలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు.

విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచడంతో పాటు ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అరుణ తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచిన సర్పంచ్ అరుణను పలువురు అభినందించారు.

రైతే రాజు కావాలి.. వ్యవసాయానికి పాత రోజులు రావాలి