ఎస్ఐఆర్ పై రేపు బీఎల్‌ఏలతో సమీక్ష

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎస్ఐఆర్ పై రేపు బీఎల్‌ఏలతో సమీక్ష
– హాజరు కానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– తాండూరు ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్ఐఆర్ ఫేజ్‌–2 ప్రక్రియపై రేపు తాండూరు నియోజకవర్గంలోని బీఎల్‌ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్‌ కరణం పురుషోత్తం రావు తెలిపారు.

టీపీసీసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అధ్యక్షతన, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలకులు జగదీశ్వర్‌రావు, వినయ్‌రెడ్డి సమక్షంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.

అంతారం రోడ్డుమార్గంలో ఉన్న శ్రీ కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 269 బూత్‌లకు చెందిన బీఎల్‌ఏలతో ఎస్ఐఆర్ ఫేజ్‌–2 ప్రక్రియపై సమీక్షించి, చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

కావున మండల, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు, బీఎల్‌ఏలు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ సీనియర్‌ నాయకులు, చైర్మన్‌లు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఇతర నాయకులు సమావేశానికి తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని కన్వీనర్ కరణం పురుషోత్తం విజ్ఞప్తి చేశారు.

వ్యక్తి అదృశ్యం..!