జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి
– విద్యార్థులకు విద్యా సామగ్రి, పండ్ల పంపిణీ
– ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చైర్మన్ ఉమా శంకర్‌పై యువకుల అభిమానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ పటేల్ ఉమా శంకర్ జన్మదిన వేడుక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆనందం నింపింది.

పటేల్ ఉమా శంకర్‌పై అభిమానం ఉన్న యువ నాయకులు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు మండలంలోని చంద్రవంచ, చిట్టిగణపూర్ గ్రామాల్లో శనివారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం పాఠశాలలకు సెలవు ఉండటంతో ఒకరోజు ముందుగానే శనివారం వేడుకలను నిర్వహించి.. ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్లు, పండ్లను పంపిణీ చేశారు.

జన్మదిన వేడుకలను కేవలం వ్యక్తిగత సంబరాలకు పరిమితం చేయకుండా విద్యార్థులకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమంగా నిర్వహించడం సంతోషంగా ఉందని యువకులు తెలిపారు. చిన్నారులకు అందించిన విద్యా సామగ్రి వారి చదువుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఇలాంటి కార్యక్రమాలు ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమాన్ని యువ నాయకులు కుర్వ సందుల నర్సిములు, కుర్వ మల్లేష్, తుల్జప్ప, ఈడిగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చంద్రవంచ హెడ్‌మాస్టర్ జైపాల్ రెడ్డి, చిట్టిగణపూర్ హెడ్‌మాస్టర్ నర్సిరెడ్డి, గ్రామ పెద్దలు పటేల్ జగదీశ్వర్, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, వెంకట్ రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


