తాండూరు నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్
– ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
– రేపు రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్న ఎమ్మెల్యే
– రిజిస్ట్రేషన్లు ఎక్కడ చేసుకోవాలంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నిరుద్యోగ యువతకు బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు.

ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ప్ తదితర పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగులకు తాండూరులో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

రేపటి నుంచి ఈనెల 31వ తేది వరకు రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల నమోదు చేపడుతున్నారు. ప్రతిరోజూ ఉదయి 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.

రేపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు సూచించారు.


