నగరేశ్వర దేవాలయ నవరాత్రి ఉత్సవాలకు కమిటీ

తాండూరు రాజకీయం వికారాబాద్

నగరేశ్వర దేవాలయ నవరాత్రి ఉత్సవాలకు కమిటీ
– చైర్మన్‌గా తర్లపల్లి భానుకుమార్ నియామకం
– ఉత్తర్వులు జారీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని శ్రీ నగరేశ్వర దేవస్థానంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్టోబర్‌ 9 నుంచి 20 వరకు జరిగే ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయం చేయడం, భక్తులకు సౌకర్యాలు కల్పించడం కమిటీ బాధ్యతలుగా పేర్కొన్నారు.కమిటీ చైర్మన్‌గా తర్లపల్లి భానుకుమార్‌ను నియమించారు.

సభ్యులుగా కల్వ స్వాతి, ఎస్‌. సత్యనారాయణ, సి. పునీత్‌కుమార్‌, దాచా చంద్రశేఖర్‌, కల్వ రాజవంశీ, కల్వ అనిల్‌కుమార్‌లను నియమిస్తూ ఎమ్మెల్యే ఉత్తర్వులు జారీ చేశారు.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజా కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌ దీపాలు, భద్రత, రద్దీ నియంత్రణ తదితర అంశాలను కమిటీ పర్యవేక్షించనుంది. దేవస్థాన అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గుమస్తానగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు!