వ్యాక్సీనేషన్ వంద శాతం పూర్తి చేయాలి
– వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరోనా నియంత్రణ కోసం వ్యాక్సీనేషన్‌ను వందశాతం పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం తాండూరు. పట్టణంలోని 12, 28వ వార్డులలో కొనసాగుతున్న వ్యాక్సీనేషన్ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య తాండూరు అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. కేంద్రాల వద్దకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీకా పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కేంద్రాలకు వద్దకు ఎవ్వరు రాకపోతే ఇంటింటికి వెళ్లి టీకా వేయాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ రాకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని, ఇందుకు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటించాలన్నారు. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ హన్మంతరావు, తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

