న్యాయ‌వాది సుధాక‌ర్‌కు స‌న్మానం

తాండూరు లైఫ్-స్టైల్ వికారాబాద్

న్యాయ‌వాది సుధాక‌ర్‌కు స‌న్మానం
– ఏపీపీ పోస్టుకు అర్హ‌త సాధింపుపై హ‌ర్షం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప్ కోర్టు న్యాయ‌వాది గోసాయి సుధాక‌ర్‌ను పాత తాండూరుకు చెందిన యువ‌జ‌న నాయ‌కులు స‌న్మానించారు. తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ పోస్టుల భ‌ర్తీ ప‌రీక్ష‌ల్లో పాల్గొన్న గోసాయి సుధాక‌ర్ ఉత్తీర్ణ‌త సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు హైదరాబాద్ లోని రాజాబహదూర్ వెంట్రమారెడ్డి తెలంగాణ పోలీసు పోలీసు అకాడమిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడ పూర్త‌య్యింది.
ఈ సంద‌ర్భంగా తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి పాత తాండూరుకు చెందిన యువ‌నాయ‌కులు న్యాయ‌వాది గోసాయి సుధాక‌ర్‌ను అభినందించి స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఆయ‌న అసిస్టెంట్ ప్ల‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌గా అర్హ‌త సాధించ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గ‌తంలో తాండూరు మండ‌లం గోనూర్‌కు చెందిన బిచ్చ‌ప్ప ఎంపిక కాగా 25 ఏండ్ల త‌రువాత తాండూరుకు చెందిన గోసాయి సుధాక‌ర్ అర్హ‌త సాధించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఆయ‌న త్వ‌ర‌లోనే పోస్టింగ్ పొందాల‌ని ఆకాంక్షించారు. ఆ ప‌దవిలో ఉన్న‌తమైన సేవ‌లందించాల‌ని అభిలాషించారు. రానున్న రోజుల్లో గౌర‌వ‌మైన స్థానాల‌ను అధిరోహించాల‌ని కోరుతున్న‌ట్లు పేర్కొన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో స‌భ్యులు నీర‌టి హ‌న్మందు, న‌వీన్ కుమార్, శివ‌కుమార్, గోపాల్, ఖ‌య్యం పాష త‌దిత‌రులు ఉన్నారు. తాండూరు మున్సిఫ్ కోర్టులో న్యాయ‌వాదిగా కొన‌సాగుతున్న గోసాయి సుధాక‌ర్ తాండూరు మున్సిప‌ల్ ఏఐటీయూసి లీగ‌ల్ అడ్వ‌యిజ‌ర్‌గా కూడ సేవ‌లందిస్తున్నారు.