శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌ను స‌న్మానించిన రొంప‌ల్లి సంతోష్ కుమార్

తాండూరు వికారాబాద్

శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌ను స‌న్మానించిన రొంప‌ల్లి సంతోష్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర బీసీ క‌మీష‌న్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌ను తాండూరు టీఆర్ఎస్ నాయ‌కులు, వైశ్య ఫెడ‌రేష‌న్ జిల్లా ప్ర‌తినిధి రొంప‌ల్లి సంతోష్ కుమార్ ఘ‌నంగా స‌న్మానించారు. శుక్ర‌వారం తాండూరుకు వ‌చ్చిన శుభ‌ఫ్ర‌ద్ ప‌టేల్ వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ వైస్ చైర్మ‌న్ బైండ్ల విజ‌య్ కుమార్‌తో క‌లిసి రొంప‌ల్లి సంతోష్ నివాసానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా రొంప‌ల్లి సంతోష్ కుమార్ బీసీ క‌మీష‌న్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌ను, జెడ్పీ వైస్ చైర్మ‌న్ బైండ్ల విజ‌య్ కుమార్‌ల‌ను శాలువా, పూలమాల‌తో ఘ‌నంగా స‌న్మానించారు. నూత‌నంగా గృహ ప్ర‌వేశం జ‌రుపుకున్న సంద‌ర్భంగా రొంప‌ల్లి సంతోష్ కుమార్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సంతోష్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఉద్య‌మ కారులు జిలాని, భాను త‌దిత‌రులు ఉన్నారు.