లారీ, ఆటో ఢీ : స‌మ‌యానికి స్పందించిన ఎస్ఐ

తెలంగాణ

లారీ, ఆటో ఢీ
– స‌మ‌యానికి స్పందించిన యాలాల ఎస్ఐ
– బాధితుల‌ను ఇన్నోవాలో ఆసుప‌త్రికి త‌ర‌లింపు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : లారీ, ఆటో ఢీకొన్న ప్ర‌మాదంలో ఆటో డ్రైవ‌ర్, ప్ర‌యాణికుడు గాయాల పాల‌య్యారు. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం యాలాల పోలీస్టేష‌న్ ప‌రిధి తిమ్మాయిప‌ల్లి గేటు స‌మీపంలో చేసుకుంది. యాలాల ఎస్ఐ పి.శంక‌ర్ తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. బుధ‌వారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కొడంగల్ నుండి తాండూర్ వైపుగా వెళ్తున్నా లారీని డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడిపిస్తూ యాలాల మండ‌లం తిమ్మాయిపల్లీ గేట్ వద్దకు రాగానే తాండూరు నుంచి కొడంగల్ వైపు వెళ్తున్న ఆటో ను ఢీ కొట్టాడు. ఈ ప్ర‌మాదంలో ఆటో డ్రైవ‌ర్‌తో పాటు అందులో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ విష‌యం తెలుసుకున్న యాలాల ఎస్ఐ శంక‌ర్ సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. గాయాల పాలైన బాధితుల‌ను త‌న పోలీసు ఇన్నోవా వాహ‌నంలో చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆటో డ్రైవ‌ర్ తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు ఎస్ఐ శంక‌ర్ తెలిపారు.