కఠినంగా క‌రోనా క‌ట్ట‌డి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

కఠినంగా క‌రోనా క‌ట్ట‌డి
– ప్రజలను అప్రమత్తం చేయండి
– నిబంధ‌న‌ల‌కు ప‌క్కాగా అమలు చేయండి
– వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డి
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: జిల్లాలో విజృంభిస్తోన్న క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, నిబంధ‌న‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు అంద‌రు దృష్టిసారించాల‌ని వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. బుధ‌వారం అభివృద్ధి, ప్రజాసమస్యలపై జిల్లా స్థాయిసంఘాల స‌మావేశంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డి అధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు.
ఈ సంద‌ర్బంగా సునీతారెడ్డి క‌రోనా మ‌హామ్మారి ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. జిల్లాలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంబిస్తోంద‌ని అన్నారు. క‌రోనాను నియంత్రించేందుకు అధికారులంద‌రు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌జ‌లు వ్యాక్సీనేష‌న్ వేసుకునేలా చూడాల‌న్నారు. రోజుకు రోజుకు పెరుగుతున్న కేసుల‌ను దృష్టిలో ఉంచుకుని ఆసుప‌త్ర‌ల‌లో, ఆరోగ్య కేంద్రాల‌లో కోవిడ్ నిర్దార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య‌ల‌ను పెంచాల‌న్నారు. దీంతో పాటు ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించేలా చూడాల‌ని చూడాల‌ని అన్నారు. క‌రోనా ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ స‌మావేశంలో జిల్లా ప‌రిష‌త్ వైస్ చైర్మ‌న్ బైండ్ల విజ‌య్ కుమార్, సీఈఓ జానకీ రెడ్డి, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, అధికారులు, జెడ్పీటీసీలు త‌దిత‌రులు పాల్గొన్నారు.