ప్రజా పాలనలో అధికారుల పాత్రే కీలకం..!
– 99 రోజుల ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

శనివారం తాండూరు మున్సిపల్ సమావేశ మందిరంలో కమీషనర్ మధుసూధన్ రెడ్డి అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 10 అంశాలతో 99రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అందరు అధికారులు సమన్వయం పాటించాలని అన్నారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. దీంతో పాటు పట్టణంలో అన్ని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్దుల్ రజాక్, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ మణిపాల్, టౌన్ ప్లానింగ్, వార్డు ఆఫీసర్స్, శానిటరీ జవాన్లు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


