ముప్పు జాగ్ర‌త్త కోస‌మే ఫీవ‌ర్ స‌ర్వే

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ముప్పు జాగ్ర‌త్త కోస‌మే ఫీవ‌ర్ స‌ర్వే
– ల‌క్ష‌ణాలు ఉన్నవారు ప‌రీక్ష‌లు చేయించుకోవాలి
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌రోనా మూడో ముప్పు నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్ర‌భుత్వం ఫీవ‌ర్ స‌ర్వే చేప‌ట్టింద‌ని, ఇందుకు ప్ర‌జ‌లంద‌రు స‌హ‌క‌రించాల‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ గుప్త అన్నారు. మంగ‌ళవారం తాండూరు ప‌ట్ట‌ణంలోని త‌న వార్డు 27లో కొన‌సాగిన ఫీవ‌ర్ సర్వేను ప‌రిశీలించారు. వార్డు ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. జ‌లుబు, జ్వ‌రం, ద‌గ్గు ల‌క్ష‌ణాలు ఉన్న వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌న్నారు. అదేవిధంగా కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న వారికి హోంఐసోలేష‌న్ కిట్ల‌ను అంద‌జేయాల‌ని స‌ర్వే బృందాలకు ఆదేశించారు. కరోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్రభుత్వం ఇంటింటికి ఫీవ‌ర్ స‌ర్వే నిర్వ‌హిస్తోంద‌ని, కావున ప్ర‌జ‌లంద‌రు ఈ ఫీవ‌ర్ స‌ర్వేకు స‌హ‌క‌రించాల‌ని అన్నారు.

అర్హులంద‌రు బూస్ట‌ర్ డోస్ తీసుకోవాలి
మ‌రోవైపు మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ అయిన పారిశుద్ధ్య కార్మికుల‌కు ఇస్తున్న బూస్ట‌ర్ డోస్ టీకా పంపిణీ ప్ర‌క్రియ‌ను కూడ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ సంద‌ర్శించి ప‌రిశీలించారు.
వ్యాక్సీనేష‌న్‌తోనే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని, రెండో డోసు తీసుకున్న వారు, 60 ఏండ్ల వృద్ధులు, పారిశుద్ధ్య కార్మికులు బూస్ట‌ర్ డోస్ తప్ప‌క తీసుకోవాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ అధికారులు, ఆర్పీలు, సిబ్బంది త‌దిత‌రులు ఉన్నారు.