కరోనా కట్టడికి వ్యాక్సీన్ ఒక్కటే మార్గం
– గ్రామంలో టీనేజర్లకు టీకాను వేగవంతం చేయండి
– పకడ్బందీగా ఫీవర్ సర్వేపై దృష్టిసారించండి
– పెద్దేముల్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ నిఖిల
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: మూడో ముప్పుతో భయాందోళనకు గురిచేస్తున్న కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సీనేషన్ ఒక్కటే మార్గమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సీనేషన్ వేసుకోవాలని, కరోనా రహిత సమాజ లక్ష్యానికి అందరు తోడ్పడాలని అన్నారు. గురువారం పెద్దేముల్ మండలం, మంబాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వాక్సినేషన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు వాక్సినేషన్ వేయించుకొని వారు వెంటనే వాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. వాక్సినేషన్ వేయించుకోవాడం వల్ల కరోనా తీవ్రతను తగ్గిస్తుందని తెలిపారు. అలాగే మొదటి డోజ్ తర్వాత రెండవ డిజ్ కు అర్హులైన వారందరు రెండవ డోస్ వేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా 15 సంవత్సరాలు గల టీనేజర్లను గుర్తించి వారందరికీ వాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. దీంతో పాటు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే పక్కడబందిగా నిర్వహించాలన్నారు. జ్వరం, ఒంటినొప్పులతో బాధపడే వారిని గుర్తించి వారికి హోమ్ ఐసొలేషన్ మెడికల్ కిట్స్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి తుకారం, ఎంపీడీవో లక్ష్మప్ప, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రాకేష్, ఆర్ఐ రాజిరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, సోషల్ వర్కర్ వెంకట్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఎఎన్ఎం కవిత, అంగన్వాడీ టీచర్లు భారతి, లక్ష్మి, ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి, సుధారాణి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

