బీజేపీ పటిష్టానికి కార్యాచరణ

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీ పటిష్టానికి కార్యాచరణ
– రాష్ట్ర నాయకులు పటేల్ రవిశంకర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో బీజేపీ పటిష్టానికి కార్యాచరణ చేయడం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పటేల్ రవిశంకర్ అన్నారు. సోమవారం తాండూరుకు వచ్చిన ఆయన స్థానిక నేతలతో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులు, వ్యవ హారాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో బీజేపీ పటిష్టానికి, నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సహం నింపేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు బీజేపీ సీనియర్ నాయకులు శెట్టి రమేష్‌ను పరామర్శించారు. ఆయన కుమారుడు శెట్టి అమితానంద్ కరోనాతో మృతిచెందడంపై వి చారం వ్యక్తం చేశారు. పటేల్ రవిశంకర్‌తో సమావేశమైన వారిలో జిల్లా నాయకులు పటేల్ విజయ్ కుమార్, సరుకుల నరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్ మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు.