ఉపాధ్యాయుడిపై దాడి దుర్మార్గం

క్రైం తాండూరు వికారాబాద్

ఉపాధ్యాయుడిపై దాడి దుర్మార్గం
– ఖండించిన పీఆర్టీయూ నాయకులు
– న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న చేప‌ట్టిన ఉపాధ్యాయులు
యాలాల, ద‌ర్శిని ప్ర‌తినిధి: స‌మాజం నిర్మాణంలో కీల‌క‌మైన ఉపాధ్యాయుడిపై దాడి చేయ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య అని పీఆర్టీయూ ఉపాధ్యాయ నాయ‌కులు అభివ‌ర్ణించారు. యాలాల మండ‌లం అగ్గనూర్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కందుకూరి ప్రవీణ్ కుమార్ పై కారు డ్రైవర్ దాడికి పాల్పడిన ఘటనను ఖండించారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం భోజ‌న విరామ స‌మ‌యంలో పీఆర్టీయూ ఆధ్వ‌ర్యంలో ఉపాధ్యాయులు న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అనంతరం యాలాల పోలీస్టేష‌న్‌కు చేరుకుని ఎస్ఐ శంకర్‌కు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు ప్ర‌వీణ్‌పై దాడిచేసి కారు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, యాలాల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అన్నారు. అలాంటి ఉపాధ్యాయుల‌పై దాడికి పాల్ప‌డ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. ఉపాధ్యాయుడు ప్ర‌వీణ్‌పై దాడిచేసి కారు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పీఆర్టీయూ నాయ‌కులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.