జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు..!
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– జర్నలిస్టు కాలనీకి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించే విధంగా కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న జర్నలిస్టు కాలనీకి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్ష మానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వంలో అండగా నిలిచిందన్నారు. తాండూరులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందేలా దృష్టిసారిస్తామని పేర్కొన్నారు.. అనంతరం జర్నలిస్టు యూనియన్ నాయకులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్, శెట్టి రవి శంకర్, వాసు, రాంచందర్, రామకృష్ణ, రాంరెడ్డి, రమేష్, శాంతు, రాంచందర్, శివకుమార్, జావిద్, అవుటి శంకర్ తదితరులు ఉన్నారు.


