మట్టితో మ‌హా శివ‌లింగాలు..!

తాండూరు వికారాబాద్

మట్టితో మ‌హా శివ‌లింగాలు..!
– 108 లింగాలు తయారు చేసిన వాస‌వి మ‌హిళా సంఘం
– సంఘం ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల ఉత్స‌వాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులోని వాస‌వి మహిళా సంఘం స‌భ్యులు మ‌ట్టితో మ‌హా శివుని ప్ర‌తిరూప‌మైన శివ‌లింగాల‌ను రూపొందించారు. మ‌హా శివ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని సంఘం ఆధ్వ‌ర్యంలో ఉత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు సంఘం ఆధ్వ‌ర్యంలో అన్ని ఏర్పాట్ల‌ను చేశారు.
ప‌ట్ట‌ణంలోని న‌గ‌రేశ్వ‌ర దేవాల‌యంలో శివ‌రాత్రి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. రెండు రోజుల పాటు శివ‌రాత్రి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు వాసవి మ‌హిళ సంఘం అధ్య‌క్షురాలు స‌రిత తెలిపారు. ఉత్స‌వాల‌లో భాగంగా సామూహిక ల‌క్ష బిల్వార్చ‌నకు ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక లక్ష బిల్వార్చన, అభిషేకాల‌ను పురస్క‌రించుకుని 108 శివ‌రాల‌ను మ‌ట్టితో త‌యారు చేసిన‌ట్లు తెలిపారు. నగ‌రేశ్వ‌ర‌ దేవాలయంలో నిర్వ‌హించే ఉత్స‌వాల‌లో మహిళలు, భ‌క్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘం కార్యదర్శి ప్రగతి, కోశాధికారి సరిత, ప్రతినిధులు దీప, నర్మద, కోస్గి లలిత, సంగీత, తదితరులు ఉన్నారు.