స్వేరోస్ తాండూరు డివిజన్ అధ్యక్షులుగా శశిధర్
– నియోజకవర్గ కమిటి ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ స్థాపించిన స్వేరోస్ తాండూరు నియోజకవర్గ కమిటిని బుధవారం ఎన్నుకున్నారు. తాండూరు డివిజన్ అధ్యక్షులుగా శశిధర్, ఉపాధ్యక్షులుగా కమల్ , నర్సింలు, జనరల్ సెక్రెటరీగా రమేష్, జాయింట్ సెక్రటరీగా శివరాజ్, ఆర్గనైజ్ సెక్రెటరీగా నర్సింలు, విజయ్ కుమార్, అధికార ప్రతినిధిగా శేఖర్, సలహాదారులు విజయ్, జనార్దన్, సభ్యులుగా సతీష్, జగదీష్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటి సభ్యులు మాట్లాడుతూ సమాజంలో ఉన్న రుగ్మతలను హెచ్చు తగ్గులను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కు ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ చార్మినార్ జోన్ అధ్యక్షులు ఏపీ శేఖర్, జిల్లా అధ్యక్షులు కొత్త గడి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంచన్పల్లి శ్రీనివాస్, చార్మినార్ జోన్ ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

