గాంధీన‌గ‌ర్‌లో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం

తాండూరు రాజకీయం వికారాబాద్

గాంధీన‌గ‌ర్‌లో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం
– వార్డు ప్ర‌జ‌ల‌తో ప్రారంభించిన కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణం 20వ వార్డు గాంధీన‌గ‌ర్‌లో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌త కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు ప‌నుల‌కు మోక్షం ల‌భించ‌డంతో శుక్ర‌వారం వార్డు కౌన్సిల‌ర్ సంగీత అజ‌య్ సింగ్ ఠాకూర్ ప‌నుల‌ను ప్రారంభించారు. వార్డులోని షిండే ఇంటి నుంచి రామ్ సార్ ఇంటి వరకు ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డు లేక ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందుకోసం గ‌త కౌన్సిల‌ర్ బిడ్క‌ర్ ఉశ 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు తీసుక‌వ‌చ్చారు.నిధులు మంజూరైనా ప్రారంభానికి నోచుకోలేదు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు ప‌నులను శుక్ర‌వారం వార్డు కౌన్సిర‌ల్ సంగీత ఠాకూరు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ వార్డు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిరంత‌రం కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రోడ్డు ప‌నుల‌ను పూర్తి చేయించి త్వ‌ర‌లోనే అందుబాటులోకి తెస్తామ‌న్నారు. మ‌రోవైపు వార్డులో రోడ్డు ప‌నులు ప్రారంభం కావ‌డంపై ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తూ కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ నాయ‌కులు అంజ‌య్ సింగ్ ఠాకూర్, కాంట్రాక్ట‌ర్ బుగ్గ‌ప్ప‌, వార్డు మ‌హిళ‌లు, యువ‌కుల త‌దిత‌రులు పాల్గొన్నారు.