కొలువులకు సిద్దమవ్వండి.. !

తాండూరు రాజకీయం వికారాబాద్

కొలువులకు సిద్దమవ్వండి.. !
– నిరుద్యోగ ప్రకటనపై గులాబీ నేతల హర్షం
– సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉద్యోగవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కొలువులకు సిద్ధం కావాలని తాండూరు టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 80,039 ఉద్యోగాల నోటిఫికేషషన్ జారీతో పాటు 11,103 కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలరైజ్‌కు ప్రకటన చేయడం పట్ల తాండూరులో టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ క‌మిటి ఆధ్వ‌ర్యంలో సంబ‌రాలు జ‌రుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంత‌రం స్వీట్లు తినిపించుకుని ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు వరాలు ప్రకటించారని అన్నారు. ఉద్యోగవకాశాలకు వయో పరిమితిని కూడ పెంచడం శుభపరిణామన్నారు. ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సమాయత్తం కావాలని, కొలువుల్లో చేరేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం. శ్రీ‌నివాస్, పట్టణ మహిళ అధ్యక్షురాలు సౌజన్య , కో-ఆప్షన్ సభ్యులు వెంకట్ రాం పవర్, దేవాల‌యాల చైర్మ‌న్లు రాజ‌న్ గౌడ్, సంజీవ్ రావు, ఎస్సీ సెల్ అధ్య‌క్షులు హ‌న్మంతు, యువ నాయ‌కులు చంటి యాద‌వ్, మోయిజ్, ఆశ్ప‌క్‌, రవి, స‌మద్ తదితరులు పాల్గొన్నారు.