స్వాతంత్ర్య స్పూర్తిని చాటాలి
– వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ పౌరులందరు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పేర్కొన్నారు. ఆదివారం వత్రోత్సవాలలో భాగంగా దీపా నర్సింలు తన కూతుళ్లతో కలిసి వారి నివాసం పైభాగంలో జాతీయ జెండాను ఆవిష్కరించి నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వజ్రోత్సవాలలో అందరు తమ తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసి భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటాలన్నారు. అదేవిధంగా మహనీయుల త్యాగాలను మరువరాదన్నారు. అంతేకాకుండా తాండూరు పట్టణ ప్రజలందరికి 75వ స్వాతంత్య్ర పత్రోత్సవ శుభాకాంక్షలను తెలిపారు.



